Friday, 27 September 2013

తెలుసుకోవలసిన ఆరోగ్య సూత్రాలు :

*మధ్యాహ్న భోజనంలోకి పెరుగు వాడకుండా మజ్జిగను వాడాలి.
* పళ్ళు తోముకున్న తరువాత ఏమి తినకుండ ఐదారు తులసి ఆకులు / రసం తీసుకోవటం వల్ల ఎప్పటికీ జ్వరాలు, అజీర్ణరోగాలు రావు.

* పండ్లు తిన్న వెంటనే మంచి నీళ్ళు తాగవద్దు. అలా చేస్తే జలుబు చేస్తుంది.
* వేడి అన్నంగాని, వీడి కాఫీ, టీలు గానీ సేవించిన వెంటనే చల్లని నీళ్ళు త్రాగకూడదు.
* స్నానం చేసిన వెంటనే ఆహారం తీసుకొనకూడదు. అలా తీసుకుంటే జీర్ణశక్తి చెడుతుంది.

Thursday, 26 September 2013

గేస్/అజీర్ణం సమస్యకు :

పద్ధతి 1:

దోరగా వేయించిన వామ్ము పొడి 100 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 50 గ్రాములు, సైంధవ లవణం 25 గ్రాములు  కలిపి ఒక సీసాలో బధ్రపరచుకుని,

1)గేస్ సమస్య వున్న వాళ్ళు అర గ్లాసు నీటిలో అర చెంచా నుంచీ ఒక చెంచా వరకు పొడిని కలుపుకుని అన్నం తినే గంట ముందు త్రాగాలి.
2)అజీర్ణ సమస్య వున్న వాళ్ళు అన్నం తిన్నా గంట తరువాత త్రాగాలి.

పద్ధతి 2:

దోరగా వేయించిన వామ్ము 100 గ్రాములు, పటిక బెల్లం(మిశ్రీ) పొడి  100 గ్రాములు, ఆవు నెయ్యి(దేశవాళీ ఆవునెయ్యి) 100 గ్రాములు ముందుగా వామ్ము పొడి, మిశ్రీ పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి, నెయ్యి వేడి చేసుకుని (మరిగించక్కర్లేదు) ఈ పొడిని వేస్తూ వుండలు లేకుండా కలుపుకోవాలి్. అది ఒక లేహ్యం లాగా/ హల్వా లాగ తయారవుతుంది.దీన్నే అగస్త్య లేహ్యం అంటారు.
దీన్ని గేస్ సమస్య వున్నా వాళ్ళు ఒక చెంచా ముద్దను అన్నం తినే గంట ముందు తినాలి.
అజీర్ణ సమస్య వున్నా వాళ్ళు అన్నం తిన్నా గంట తరవాత తినాలి.
ఈ లేహ్యంతో వాతం వలన కలిగిన కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి కూడా తగ్గిపోతుంది.

రోజుకు రెండు పూటలా పైన చెప్పిన విధానాలలో ఏది వీలైతే అది ఆచరించుకోవచ్చు.

Monday, 23 September 2013

జాగృతి

పొట్ట పెరిగితే రోగం మొదలైనట్లే, వీపు పెరిగితే రోగం ముదిరినట్లే.

కంటి రెప్పల వెంట్రుకలు వూడుతూవుంటే:

ఆరు గ్రాముల వామ్ము తెచ్చి శుభ్రం చేసి రోట్లో వేసి అందులో నాటు కోడి గుడ్డులోని తెల్ల సొన కలిపి మెత్తగా మర్ధించి కను రెప్పల మీద లేపనం చేస్తూవుంటే, రెప్పల వెంట్రుకలు వూడటం ఆగుతుంది. ఓక వేళ వూడి వుంటే వెంట్రుకలు మళ్ళీ మొలుస్తయ్. ఇంకా దీనివల్ల కనురెప్పల వాపు, రెప్పల యందలి దుర్మాంసం కూడా హరించి నేత్రాలు బహుసుందరంగా రూపుదిద్దుకుంటయ్.

Wednesday, 18 September 2013

చిగుళ్ళవాపుకు :

తులసి ఆకులు 10 గ్రాములు, సన్నజాజిఆకులు 6 గ్రాములు కలిపి నమిలి మింగుతూ వుంటే నాలుగైదు పూటల్లో చిగురువాపు, చిగురుపోటు, దంతాలపోట్లు తగ్గిపోతయ్. ఒక్కసారికే ఎంతో హాయిగా వుంటుంది..
ఆచరించి మీ అనుభవం తెలియజేయండి..

Saturday, 14 September 2013

తెలుసుకుందాం :

1. నీరు ఎక్కువ తాగినా కూడా మూత్రపిండాలకు, మూత్రాశయంకు భారం పెరుగుతుంది.
2. ఆరోగ్యం మొత్తం సూర్య భగవానుని మీద ఆధారపడి వుంటుంది.
3. ప్రతి అవయవానికి అతి తొందరగా చేరేది నువ్వులనూనె.

స్నాన నిబంధనలు :

1. నూనె పెట్టూకోకుండా స్నానం చేయరాదు.
2. హడావిడిగా స్నానం చేయరాదు.
3. భోజనం చేసినవెంటనే స్నానం చేయరాదు.
4. చన్నీళ్ళ స్నానం :చన్నీళ్ళను మొదట తలమీద పోసుకుని తరవాత మిగతా భాగాల మీద పోసుకుని స్నానం చేయాలి.
5. వేన్నీళ్ళ స్నానం : వేన్నీళ్ళను మొదట కాళ్ళమీద పోసుకుని తరవాత పై భాగాల మీదా పోసుకుని స్నానం చే్యాలి.