Thursday, 28 May 2015

చిట్టి చిట్కాలు: తెలుసుకుందాం

1. అల్లాన్ని గుజ్జులా నూరి ప. ట్టిస్తుంటే చేతుల్లో, కాళ్ళలో పొరలు వూడటం తగ్గిపోతుంది.
2. గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ళ మంటలు హరించిపోవును.
3. కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి.
4. జీడిమామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తుంటే ఆనెలు కరిగిపోతాయి.
5. ఆహారంలో ఉసిరిక, నిమ్మ, పాతచింతపండు మితంగా రోజూ వాడుతుంటే జీవితాంతం ఏ రోగం రాదు.
6. మిరపకారానికి బదులు మిరియాలకారం వాడుతుంటే జీవితంలో రోగమేరాదు.
7. పరగడుపున మూడు సరస్వతి ఆకులు తినేవారికి సదా శారీరక, మానసిక బలం నిండుగా ఉంటుంది.

                    మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

కాలేయం ఎందుకు పాడవుతుంది?

మన ప్రకృతి వ్యతిరేకమైన ఆహార విధానాల వలన, మన చెడు అలవాట్లవల్ల కాలేయం పాడవుతుంది. పని వత్తిడి వలన సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా కాలేయం పాడవుతుంది.  ఎల్లప్పుడూ నూనె పదార్ధాలు, పూరీలు,బజ్జీలు, బిర్యానీలు మొదలగునవి, మాంసాహరము వంటి కఠిన పదార్ధాలు అధికంగా భుజించడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. నెలలు, సంవత్సరాల తరబడి కల్లు, సారా, బ్రాంది, విస్కీ వంటి మత్తు పానీయాల సేవనంవల్ల కూడా కాలేయం పాడవుతుంది.
కాలేయానికి మత్తుపానీయాలలోని విషపదార్ధాలను నిర్వీర్యం చేసే గుణముంటుంది. కానీ అది కొంతకాలానికి పనిచేసి చేసి అలసిపోయి నిర్వీర్యమై వ్యాధిగ్రస్తమౌతుంది. అప్పుడు ఈ పదార్ధాలు అందులో నిలువుండి మురిగి గడ్డలు గడ్డలుగా మారతాయి.  అందులో చీము కూడా నిండుతుంది. ఈ వ్యాధినే ఆంగ్లంలో ' లివర్ ఆబ్ సెస్ ' అని అంటారు.
ఆ గడ్డల నుండి లీటర్ల కొద్ది చీము, చెడు రక్తము తీయడం జరుగుతుంది. అలాగే, కొంతకాలముంటే ఆ భాగం చెడిపోతుంది. అప్పుడు ఆ భాగాఅన్ని కూడా ఆపరేషన్ ద్వారా తీసెయ్యడం మనం గమనిస్తున్నాం. అతి తాగుడు అలవాటున్నవారు చివరకి కాలేయానికి సంధించిన క్యాన్సర్ తో మరణించడం మనం చూస్తున్నదే.....

                            మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ

కాలేయము పాడైతే జరిగే నష్టం ఏమిటి ?

కాలేయం పాడైతే జరిగే నష్టం చాలా వుంది. ఎందుకంటే ఇది చెడిపోతే ముందుగా ఆకలి దెబ్బ తింటుంది.ఆహారం చూస్తే వాంతి వచ్చినట్లనిపిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థ ఆ పైన పాడవుతుంది. మలమూత్రాల రంగు మారిపోతుంది. మనిషి బలహీనపడిపోతాడు.పసరికలు కూడా రావచ్చు. కాలేయం పెరిగిపోయి అందులో గడ్డలు ఏర్పడవచ్చు. దీనితోపాటు పిత్తాశయము (గాల్బ్లాడర్) కూడా చెడిపోవడానికి, దానిలో రాళ్ళు ఏర్పడటానికి దోహదమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే కాలేయం కుచించుకుని దానికి సంబంధించిన క్యాన్సర్ కు దారితీయవచ్చు. ఈ విధం గా ఇంకెన్నో నష్టాలు కాలేయము పాడవడంవల్ల జరుగుతాయి.

                        మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Wednesday, 27 May 2015

కాలేయము (లివర్ ) గురించి మీకు తెలుసా?

దీనిని ఆధ్యాత్మిక పరిభాషలో సూర్యచక్రమని అంటారు. ఇది మానవ శరీరంలో అతిముఖ్యమైన గ్రంధి. ఇది ఛాతిలో ప్రక్కటెముకుల లోపల క్రిందిభాగంలో కుడివైపున త్రికోణాకారంలో ఉంటుంది.
లివర్ నుండి పైత్యరసం ( బైల్ జ్యూస్) ఆహార సేవన తరువాత ప్రేగుల్లోకి కుమ్మరించబడుతుంది. ఆ పైత్యరసం ఆహారానికి, మలానికి రంగునిస్తుంది. ఆకలి బాగా ఉండేలా చూస్తుంది. తెలిసో తెలియకో ఆహారపదార్ధాల ద్వారా కొన్ని విషపదార్ధాలు, మలిన పదార్ధాలు శరీరంలోకి ప్రవేశిస్తె వాటి చెడు ప్రభావము శరీరంపై పడకుండా వాటిని బలహీనపరుస్తుంది.
కాలేయము గ్లూకోజ్ ను, కొవ్వును కూడా నిలువుంచుకొని అత్యవసర సమయంలో వాడుకునేలా చేస్తుంది. అంతేకాక ఇది మూత్రపిండాలతో, ప్రేవులతో అవినాభావ సంబంధమును కలిగివుంటుంది.
      
                        మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

చిట్టి చిట్కాలు

1. రోజూ నాలుగు ఖర్జూరాలు తింటుంటే పురుషులకు మగసిరి పెరుగుతుంది.
2. రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపిర్లు ఊడి పడిపోతాయి.
3. రోజూ కొద్ది కొద్దిగా జీలకర్ర తింటుంటే స్త్రీల తెల్లబట్టరోగం హరించిపోతుంది.
4. తెగిన గాయాలకు ఆవునెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి.
5. రోజూ పసుపు 3 గ్రాములు, ఉసిరికపొడి 3 గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది.
6. తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో 3 చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే తెలివి వస్తుంది.
7. రోజూ వులవ గుగ్గిళ్ళు 100 గ్రాములు తింటూంటే కొవ్వు తగ్గి సన్నబడతారు.

                          మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Tuesday, 26 May 2015

చిట్టి చిట్కాలు

1. జీలకర్ర పొడి 5 గ్రాములు, గంటకు రెండు సార్లు తింటుంటే గొంతు బొంగురు తగ్గుతుంది.
2. దొరికినంత కాలం ఒక జామపండును రోజూ తింటూంటే జీవితంలో గుండె జబ్బు రాదు.
3. దానిమ్మ చిగుళ్ళు రోజూ మూడు నాలుగు తింటూంటే అతి చెమట హరించిపోతుంది.
4. రెండు వెల్లుల్లి రేకలను నేతిలో వేయించి అన్నంతో కలిపి తింటుంటే నరాలకు బలం కలుగును.
5. చిన్న అల్లం ముక్కను చప్పరిస్తుంటే నాలుక పక్షవాతం తగ్గిపోతుంది.
6. తుమ్మ జిగురును 10 గ్రాములు కప్పు నీటితో కలిపి చక్కెరవేసి తాగితే బలమొస్తుంది.
7. ఒక చెంచా ఉసిరిక కాయల పొడి నీటితో సేవిస్తుంటే విరేచనాలు ఆగుతాయి.

మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Monday, 25 May 2015

చిట్టి చిట్కాలు

1. పూటకు మూడు మారేడాకులు తింటుంటే మొండి ఉబ్బస రోగం హరించుకుపోతుంది.
2. ఆవు మూత్రం అరకప్పు మోతాదుగా రెండుపూటలా తాగుతుంటే ఉబ్బు రోగం తగ్గిపోతుంది.
3. రోజూ రెండు మూడు ఎండు ఖర్జూరపండ్లను తింటుంటే ఏనాటికి ఎముకల వ్యాధులు కలుగబోవు.
4. రోజూ రెండు మూడు సార్లు ఒక నిమ్మపండూ రసం మజ్జిగ లో కలిపి తాగుతుంటే కడూపులో కంతులు కరుగుతాయి.
5. ధనియాల కషాయం రెండుపూటలా తాగుతుంటే కడుపులో పుట్టిన మంట తగ్గుతుంది.
6. రోజూ రెండు పచ్చి దొండకాయలు తింటుంటే రక్తప్రసరణ బాగా జరిగి తిమ్మిర్లు తగ్గుతాయి.
7. చింతాకు రసాన్ని వారానికి ఒకసారి పట్టిస్తుంటే నాలుగు వారాల్లో మొలలు కరిగిపోతాయి.

                                మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ